బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

byసూర్య | Mon, Oct 25, 2021, 06:30 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్రవేశపెట్టిన తీర్మానాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత పాలకులు కొన్ని కులాలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అన్ని కులాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రతి వృత్తికి, కులానికి కేసీఆర్ గౌరవం కల్పించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదుగుతున్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో చదువుతున్నారు.


భారతదేశంలో కనీసం 60 శాతం జనాభా ఉన్న బీసీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణలో బీసీల అభివృద్ధికి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ముదిరాజ్, గంగపుత్రుల సోదరులు మత్స్య సంపద సృష్టిస్తున్నారు. పౌష్టికాహారం ఇప్పుడు అందరికీ అందుతుంది. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపించారు. కల్లు గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశారు. వైన్ షాపుల్లో బీసీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అంధకారంలో ఉన్న చేనేత వృత్తిని ఆదుకున్నారు. నాయీ బ్రహ్మణులకు, రజకులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM