ప్లీనరీలో వంటకాలు ఇవే.. 33 రకాల వెరైటీలు

byసూర్య | Mon, Oct 25, 2021, 04:00 PM

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా సోమవారం ప్లీనరీ జరగనుంది. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది తరలిరానున్నారు. పార్కింగ్‌ నుంచి సభా వేదిక దాకా అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగాయి. 


పార్లమెంట్‌ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. 10వ సారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది. మరోవైపు టీఆర్ ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు వడ్డించనున్నారు.


వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే ప్రతినిధులకు 33 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. ధమ్ చికెన్ బిర్యాణి, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్.


ఇటు వెజ్ బిర్యాణి, వైట్ రైస్, మిర్చి కా సలాన్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్, పెరుగు, పెరుగు చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ, వంకాయ చట్నీ, బీరకాయ టమోట చట్నీ, పాపడ్, వడియాలు, జిలేబీ, డబల్ కా మీటా, ఐస్ క్రీం ఉంచారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కంటిన్యూ అవుతారని సమాచారం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM