తాటిబెల్లంతో కరోనా ఖతం.. ఆ ప్రాంతంలో జోరుగా ప్రచారం.. క్యూ కడుతోన్న ప్రజలు

byసూర్య | Fri, Jun 11, 2021, 11:57 AM

తాటి కల్లు తాగితే కరోనా పోతుందని ఓ ఊర్లో నమ్మకం, తాటి బెల్లం తింటే కరోనా రాదని మరో ఊరివారి నమ్మకం. దీంతో తాటికల్లుతో తాటి బెల్లాన్ని తయారుచేసి అందరూ సేవిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో గీత కార్మికులు ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రేగడిమద్దకుంట గ్రామంలో పెద్దమొత్తంలో తాటి కల్లు తీస్తారు. వందల సంఖ్యలో తాటిచెట్లు ఉన్నాయి. గీతకార్మికులు నిత్యం వందల లీటర్ల కల్లు గీస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తాటికల్లు సేవిస్తుంటారు. అయినా కల్లు మిగిలిపోతుంది. దీంతో కల్లు వృథాగా పోతోందని గీత కార్మికులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


కల్లును మరగబెట్టి తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ తాటి బెల్లాన్ని సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. నెల్లూరు ఆనందయ్య మందులో తాటి బెల్లాన్ని కూడా వాడుతున్నారని, తాటి బెల్లం తింటే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా కూడా పోతుందని గీత కార్మికులు బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా తాటిబెల్లంతో కరోనా పోతుందో లేదో తెలియదు కాని వృథాగా పోతున్న కల్లుతో తాటి బెల్లం తయారు చెయ్యడం మంచి ఆలోచన. దానితో గీతా కార్మికులకు ఉపాధి కూడా దొరుకుతుందని అంటున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM