సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద

byసూర్య | Fri, Jun 11, 2021, 11:24 AM

సంగారెడ్డి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీఎంసీల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు.


జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో గత రెండు రోజులుగా జూరాల ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.400 మీటర్ల వరకు నీరు మట్టం ఉన్నది. దీంతో నీటి నిల్వ 9.418 టీఎంసీలకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది.


20,809 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) 17,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM