కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మారయ్య

byసూర్య | Sun, Jun 06, 2021, 02:45 PM

కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కార్మిక సంఘాలను అణచివేస్తున్నారంటూ ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆటో కార్మికులకు రూ. రూ. 77 కోట్ల పన్ను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆటో డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద అమలు చేసి వారి కుటుంబాలకు కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలిచారని మారయ్య అన్నారు. 500 నిరుపేద ఆటోడ్రైవర్లకు ఇళ్లను కేటాయించి ఆదుకున్నారని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకొని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని తెచ్చి డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ వాహన డ్రైవర్ల జీవితాలను కాపాడారని అన్నారు. ఈటల రాజేందర్‌ రాజకీయ లబ్ధికోసం కార్మికులను వాడుకోవాలని అనుకోవడం హేయనీయమని ఆయన పేర్కొన్నారు.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM