ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో 'రైతు బంధు' జమ : మంత్రి నిరంజన్‌రెడ్డి

byసూర్య | Sun, Jun 06, 2021, 12:33 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిన బ్యాంకుల ఖాతాల్లోనూ నిధులు జమవుతాయని చెప్పారు. ఇటీవల పలు బ్యాంకులు విలీనమవగా.. ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు మారాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ నెల 10వ తేదీలోపు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి.. నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధరిణిలో నమోదైన రైతులందరికీ సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM