తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు

byసూర్య | Fri, Apr 09, 2021, 10:12 AM

 తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 15వేలు దాటింది. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 402 హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.21 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకు 3.03లక్షల మంది కోలుకున్నారు. మరో 1,746 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM