శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల
 

by Suryaa Desk |

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శుభకార్యం కోసం బెంగళూరు వెళ్లి, తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, 10 తులాల వెండి దోచుకెళ్లా రు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై వివరాలు.. యాప్రాల్‌లోని శైలి గార్డెన్‌లో నివాసముంటున్న హరి సముద్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మార్చి 30 బెంగళూరుకు వెళ్లాడు. ఏప్రిల్‌ 3న సోదరిని తీసుకుని వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా, బంగారం, వెండి కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM