ఈ వేసవిలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి ఇలా !
 

by Suryaa Desk |

సమ్మర్ వస్తే చర్మం అంతా పాడైపోతుంది. వేసవి తాపానికి తోడు వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీకలిపి ఒత్తిడికి దారి తీస్తుంది. ఫలితంగా చర్మంపై ఆ ప్రభావం పడుతుంది. అయితే ఫ్రిజ్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ తో వీటిని జయించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐస్ క్యూబ్ లను మొఖంపై ఉంచుకోవడం ద్వారా అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచటంతో పాటు మీ చర్మం యొక్క రంగును ప్రకాశవంతం చేస్తుంది. మొటిమలపై ఐస్‌క్యూబ్ ఉంచడం వాడటం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఐస్ క్యూబ్స్‌ను పల్చటి క్లాత్ లేదా రుమాలులో చుట్టి మీ ముఖం మీద రబ్ చేయవచ్చు. అయితే ఐస్ ట్రై లో నీళ్లకు బదులుగా మరో చక్కని మార్గం అనుసరించవచ్చు. టొమాటో గుజ్జు, కలబంద రసం, దోసకాయ రసం వంటి పదార్థాలను ట్రై లో ఉంచి క్యూబ్స్ గా తయారు చేసుకోవాలి. వాటిని ముఖంపై రబ్ చేసుకుంటే చర్మానికి అదనపు పోషకాలు అందుతాయంటున్నారు నిపుణులు. చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి కింద వాపు వంటివి ఏర్పడతాయి. వీటికి ఐస్ క్యూబ్స్ తో మర్దన చేస్తే మంచి ఫలితం వస్తుంది. అయితే కళ్ళ చుట్టూ ఐస్ క్యూబ్స్ ఉంచినప్పుడు జాగ్రత్త వహించాలి. వాటిలో ఏదైనా ప్రత్యేకమైన పదార్థాలు ఉంటే కళ్లు ఇబ్బందికి గురవుతారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి కళ్ళ క్రింద గట్టిగా రుద్దకూడదు. ఐస్‌క్యూబ్ చల్లదనం మీ చర్మం యొక్క రంధ్రాలను బిగుతుగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాల రూపాన్ని పరిమితం చేస్తుంది.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM