హైదరాబాద్‌ నగరం పై నిప్పులు కురిపిస్తున్న భానుడు...!
 

by Suryaa Desk |

హైదరాబాద్‌ నగరంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఎండతీవ్రతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. నడినెత్తిపై సూర్యుడు, ఉక్కపోతతో ఏం ఎండలు. అంటూ ఉసూరుమంటున్నారు. గ్రేటర్‌లో మార్చి 15 నుంచి 31 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజూ సగటున 37 డిగ్రీలకు పైగా ఎండలు ఉండడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ ఎత్తులో ఉత్తర, వాయువ్య దిశల నుంచి వేడిగాలులు తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నందున ఎండతీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నగర పరిధిలో అత్యధికంగా సరూర్‌నగర్‌ మండలంలోని విరాట్‌నగర్‌లో 39. 7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణగూడ, గన్‌ఫౌండ్రీలో 39. 6, హయత్‌నగర్‌లో 39. 4, సికింద్రాబాద్‌, మచ్చబొల్లారం, ఖైరతాబాద్‌ గణాంక భవన్‌ వద్ద 39. 2 డిగ్రీలు రికార్డయ్యాయి. నగర వ్యాప్తంగా మొత్తంగా 39. 3 డిగ్రీలు నమోదయ్యాయి.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM