తెలంగాణలో మూడు రోజులు వడగాలులు...!
 

by Suryaa Desk |

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మంగ‌ళ‌వారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమో‌ద‌య్యాయి. అత్యధికంగా కుమురం భీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీ‌లుగా రికార్డయింది. తెలంగాణలో ఉత్తర దిశ‌నుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. వీటి ప్రభా‌వంతో మూడు రోజుల పాటు ఆది‌లా‌బాద్‌, కుమురం భీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, మహ‌బూ‌బా‌బాద్‌, వరం‌గల్‌ రూరల్‌, వరం‌గల్‌ అర్బన్‌, జన‌గామ, మహ‌బూ‌బ్‌‌ న‌గర్‌, నాగ‌ర్‌‌ క‌ర్నూల్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట, జోగు‌లాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడ‌గా‌లులు కొన‌సాగే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్ వాతా‌వ‌రణ కేంద్రం పేర్కొంది. హైద‌రా‌బా‌ద్ ‌లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM