నేడు కాళేశ్వరానికి కేసీఆర్..

byసూర్య | Tue, Jan 19, 2021, 09:15 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకుంటారు. నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని ఆయన సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజే అత్యంత ప్రధానమైనది. ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోటుకు ఎగువన ఈ బ్యారేజీని నిర్మించారు. దీనికి మొత్తం 85 గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద గోదావరిలో నీటిమట్టం వంద అడుగులకు చేరింది.


ఈ నేపథ్యంలో దాదాపు 5 నెలల విరామం తర్వాత మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నీటి తరలింపు ప్రక్రియను స్వయంగా వీక్షించనున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఎంత నీరు ఉంది? రోజుకు ఎన్ని టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయవచ్చు? వేసవికాలంలో కూడా రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు.


సుమారు 4 గంటల పాటు అక్కడే ఉండనున్నారు కేసీఆర్. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం వెళ్తారు. ముందుగా కాళేశ్వర, ముక్తీశ్వర దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్‌ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. బరాజ్‌ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగివస్తారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM