భారీ చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

byసూర్య | Sat, Jan 16, 2021, 10:45 AM

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన చోరీకి సంబంధించిన కేసును మార్కెట్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నేమిచంద్ జైన్ జ్యువెలరీ షాప్‌లో ఇంటి దొంగే చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. జ్యవెల్లరీ షాపు యజమానికి చెందిన డ్రైవర్ తన స్నేహితులతో కలిసి చోరీకి స్కెచ్ వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


కాగా.. సికింద్రాబాద్‌లోని పాట్‌ మార్కెట్‌కు చెందిన అనిల్‌ జైన్‌.. అదే ప్రాంతంలో నేమిచంద్‌ జైన్‌ జువెల్లరీ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుఝామున 3.30 గంటల ప్రాంతంలో దుకాణం వెనుక వైపు ఉన్న వెంటిలేటర్‌ గ్రిల్స్‌ వంచి లోపలికి ప్రవేశించిన దొంగలు.. దుకాణంలో ఉన్న కిలో 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్త్తుకెళ్లారు. శుక్రవారం పండుగ కావడంతో మధ్యాహ్నం తరువాత యజమాని దుకాణానికి రాగా సామగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించిన ఆయన దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఏసీపీ వినోద్‌కుమార్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM