తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెనింగ్ మార్గదర్శకాలు విడుదల..

byసూర్య | Wed, Jan 13, 2021, 01:13 PM

తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ రీ ఒపెనింగ్ కి కసరత్తు చేస్తోంది. కరోనా రూల్స్ కు అనుగుణంగా స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాలని విద్యాశాక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో విద్యాసంస్థల పర్యవేక్షణకు కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ప్రతి స్కూల్, కాలేజీలో రెండు ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేయాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.
స్టూడెంట్స్ ఎంట్రీ, ఎగ్జిట్ కు వేర్వేరుగా దారులు సిద్ధం చేయాలని సూచించారు. విద్యాసంస్థల్లోకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో ఏమైనా పొలిటికల్ మీటింగ్ పెట్టాలంటే తప్పకుండా కలెక్టర్ నుంచి అనుమతి తప్పనిసరని పేర్కొంది. స్టూడెంట్స్ కు మాస్కులు తప్పనిసరి అని..అయితే పేరెంట్స్అనుమతి ఉంటేనే వారిని విద్యాసంస్థల్లోకి అనుమతించాలన్నారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా జరుగుతున్న డిజిటల్ క్లాసులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న స్టూడెంట్స్ ను విద్యాసంస్థల్లోకి అనుమతించరాదని సూచించారు. హాస్టళ్లు, క్లాస్ రూమ్స్ ను రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయించాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ఇంటర్ కాలేజీల్లో 300 మంది స్టూడెంట్స్ దాటితే రెండు షిఫ్టుల్లో కాలేజీలు నిర్వహించాలి. లేదంటే ఉదయం 9.30 నుండి సాయంత్రం 4 వరకు కాలేజీలు ఉంటాయి. ఫస్టియర్, సెకండియర్ వేర్వేరుగా లేదా కోర్సుల వారీగా షిఫ్టులు ఉంటాయి.
ఏప్రిల్ 30 వరకు ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ కొనసాగుతుంది. స్కూళ్లలో క్లాస్ రూమ్లో 20, కాలేజీ క్లాస్‌లలో 30 మందే ఉండాలి. బెంచికి ఒక్కరే కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి. ఈసారి డిగ్రీ,పీజీలో సెమిస్టర్కు మినిమమ్ అటెండెన్స్పరిగణనలోకి తీసుకోరు. స్టూడెంట్లు ఎక్కువుంటే 50% మందికి ఒకసారి సారి చొప్పున డే బై డే క్లాసులుంటాయి. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రివైజ్డ్ షెడ్యూల్ ఇవ్వనున్నారు. టెన్త్, ఇంటర్ సెకండియర్, డిగ్రీ పరీక్షల షెడ్యూల్ తర్వాత రిలీజ్ చేస్తారని తెలిపింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM