టీసీఎస్ కొత్త చరిత్ర

byసూర్య | Tue, Jan 12, 2021, 03:37 PM

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చరిత్ర సృష్టించింది. సోమవారం టీసీఎస్‌ షేర్‌ ధర 3.5 శాతం పెరిగి గరిష్ఠ స్థాయి రూ.3,230ను తాకిం ది. దీంతో తొలిసారి టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ 12 లక్షల కోట్లు దాటి మరో ఘనతను సాధించింది. ఇంతకుముందు ఈ ఘనత ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సాధిం చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అక్టోబ ర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ఊహించినదా నికంటే మెర్గుగా ఉన్నాయి. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.7,504 కోట్లతో పోలిస్తే.. కంపెనీ నికర లాభం సంవత్సరానికి 7.17 శాతం పెరిగి.. రూ.8,727 కోట్లకు చేరుకుంది. ట్రేడింగ్‌ సమయంలో టీసీఎస్‌ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సోమ వారం తొలిసారిగా టీసీఎస్‌ కంపెనీ క్యాపి టలైజేషన్‌ వాల్యూ 12 లక్షల కోట్లు దాటింది. దేశంలో 12 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్‌ దాటిన రెండో కంపెనీగా టీసీఎస్‌ రికార్డు సృష్టించింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM