బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు: భూమా ఫ్యామిలీపై ఆరా

byసూర్య | Tue, Jan 12, 2021, 03:42 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియను రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న అఖిలప్రియను డీసీపీ కమలేశ్వర్ ప్రశ్నించారు. కిడ్నాప్ చేసిన తరువాత నార్త్ జోన్ డీసీపీకి కాల్ రావడంతో పాటు కిడ్నాపర్లు సేఫ్ అంటూ వచ్చిన కాల్స్ పై క్లారిటి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కిడ్నాప్ వ్యహహారంలో భూమా కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు.. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు జగత్ కిడ్నాపర్లుతో మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ అరెస్టు సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవర్ చెప్పే ఆధారాలతో మరోసారి అతన్ని విచారించే అవకాశం ఉన్నట్టు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM