గీత కార్మికులకు సీఎం కేసీఆర్ చేయూత : మంత్రులు

byసూర్య | Tue, Jan 12, 2021, 03:04 PM

గీత కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేయూత ఇస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేట గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తాటి, ఈత వనాన్ని వారు ప్రారంభించారు. అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. 


ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ముందు ఉండడంతోపాటు వారికి అన్ని రకాల అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలుస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. గత ప్రభుత్వాలు అందించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని వారు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌, మేయర్ పాపాలాల్, విజయ్ కుమార్ పలువురు టీఆర్ఎస్ నాయకులు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM