కరోనా రికవరీ రేట్ 90 శాతం : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్

byసూర్య | Sun, Oct 18, 2020, 02:11 PM

తెలంగాణలో కరోనా నియంత్రణలో ఉందని, కరోనా రికవరీ రేట్ 90 శాతం ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో లక్ష మందికిపైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. నీళ్లు, ఆహారం, దోమల ద్వారా వచ్చే అంటువ్యాధులపై సమీక్ష నిర్వహించామని, జీహెచ్ఎంసీలో 182 వైద్య శిబిరాలు నిర్వహించామని శ్రీనివాస్ పేర్కొన్నారు.


పండుగల నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని డీఎంఈ రమేష్‌రెడ్డి హెచ్చరించారు. గాంధీలో ప్రస్తుతం 350 కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌కు ఇంకా 3, 4 నెలల సమయం పట్టొచ్చని చెప్పారు. వరదల రిహాబిలిటేషన్ సెంటర్లలో టెస్టులు చేస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రులను అలెర్ట్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా వైరస్ బారిన పడేవారికంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజు 40 వేల పైచిలుకు పరీక్షలు చేస్తుండగా.. 2 వేలలోపే కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.  


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM