హైద‌రాబాద్ - బెంగ‌ళూరు హైవే పున‌రుద్ధ‌ర‌ణ‌

byసూర్య | Fri, Oct 16, 2020, 12:43 PM

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద అప్ప చెరువుకు గండి ప‌డ‌టంతో హైద‌రాబాద్ - బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి పూర్తిగా దెబ్బ‌తిన్న విష‌యం విదిత‌మే. గ‌త రెండు రోజుల నుంచి జాతీయ ర‌హ‌దారి 44పై పోలీసులు పూర్తిగా రాక‌పోక‌లు నిషేధించారు. రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టి.. ఆ హైవేను శుక్ర‌వారం ఉద‌యం నుంచి పున‌రుద్ధ‌రించారు. హైవేపై ఒకే మార్గంలో రాక‌పోక‌ల‌కు అనుమ‌తిచ్చారు అధికారులు. సాయంత్రం వ‌ర‌కు ఇరువైపులా రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆరాంఘ‌ర్ నుంచి శంషాబాద్ వైపు య‌ధావిథిగా రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయి.


హైద‌రాబాద్ - బెంగ‌ళూరు హైవే మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ క‌లిసి ఇవాళ ఉద‌యం ప‌రిశీలించారు. సాయంత్రం వ‌ర‌కు రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అప్ప‌చెరువు అడ్డుక‌ట్ట ప‌నులు కూడా వేగ‌వంతం చేశామ‌ని, రెండు మూడు రోజుల్లో అడ్డుక‌ట్ట పూర్తిగా వేస్తామ‌ని తెలిపారు. మూడు రోజుల నుంచి విరామం లేకుండా పోలీసులు, అధికారులు ప‌నులు చేస్తున్నార‌ని చెప్పారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM