వరద ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు అవస్థలు

byసూర్య | Fri, Oct 16, 2020, 12:35 PM

వర్షాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లోని వందల ప్రాంతాల్లో ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్ స్టేషన్లలోకి నీళ్లు రావడం, కాలనీలు, అపార్ట్ మెంట్లలోకి నీళ్లు రావడంతో అనేక చోట్ల కరెంట్ కట్ అయింది. సుమారు 35 వేల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నామని డిస్కం వర్గాలు చెబుతున్నాయి. వరదల వల్ల పలు ప్రాంతాల్లో అదే విధంగా మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్మర్లు కరెంటు పోల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి.దీంతో విద్యుత్ శాఖకు దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రిలిమినరీ అంచనా వేశారు. ఎల్ బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కుగా ఉందని చెప్పారు. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం తో చాలా కాలనీలు జలమయమయ్యాయి. . ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చినట్లు ఆఫీసర్లు గుర్తించారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM