ప్రమాదకర స్థలాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం : కేటీఆర్

byసూర్య | Wed, Oct 14, 2020, 02:08 PM

వరద సహాయక చర్యలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ రాత్రి 12 గంటల వరకు వర్షాలు, వరదలపై సమీక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రేటర్‌లో డీఆర్ఎఫ్ వ్యవస్థ ఉందన్నారు. వరద ప్రాంతాల్లో దాదాపు 40 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 80 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. 


ప్రమాదకర స్థలాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ సిటీలో కొంతమందికి నోటీసులు ఇచ్చామన్నారు. భవనాలు ఖాళీ చేయని వారిని బలవంతంగానైనా చేయిస్తామన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు, మేయర్, డిప్యూటీ మేయర్ జోన్ల పర్యవేక్షణలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ గేట్లను ఓపెన్ చేశామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం వరదలపై హైఅలెర్ట్‌గా ఉందన్నారు. అపార్ట్‌మెంట్‌లు, సెల్లార్ల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ వెల్లడించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM