నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నేడు, రేపు సెలువు

byసూర్య | Wed, Oct 14, 2020, 12:31 PM

భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నేడు, రేపు సెలువు ప్రకటించింది. మరో రెండుమూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.


నిన్న కురిసిన వర్షానికి నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. దీనికి తోడు హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరో మూడు రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM