వరుణిడి బీభత్సంతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..

byసూర్య | Wed, Oct 14, 2020, 12:23 PM

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ఇళ్లలోకి నీరు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. లోతట్లు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ ఆదేశించారు.


హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, బండ్ల గూడ వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఫలక్ నుమా రైల్వే వంతెన వైపు రాకపోకలపై నిషేధం విధించారు. వర్షాల ధాటికి వరద నీటిలో అల్ జుబేర్ కాలనీకి ఓ మహిళ మృత‌దేహం కొట్టుకువచ్చింది.


మియాపూర్ ప్రకాశ్ నగర్ లో చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో అక్కడి అమ్మవారి గుడి కూలిపోయింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై రాకపోకలపై నిషేధం విధించారు. ఓల్డ్ బోయినపల్లి వికాస్ నగర్ లో రాయల్ ఎన్ క్లేవ్ ను వరదనీరు చుట్టుముట్టింది. దీంతో నిత్యావసరాలు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబర్ పేట నుంచి ఓయూకి వెళ్లే శివం రోడ్డులో ఓ భారీ వృక్షం కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


అల్వాల్ భూదేవినగర్ లో ఇళ్లలోకి నీరు చేరింది. పాతబస్తీలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.  ఉప్ప‌ల్ నుంచి ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ నుంచి కోఠి రోడ్లు మూసివేశారు. కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచింది. నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ లో భారీగా నీరు నిలిచింది.


 


భారీ వరద ధాటికి సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రహదారిలో వెళ్తున్న కార్లు కొట్టుపోవడతో దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృత‌దేహాలు లభ్యమయ్యాయి.


 


సంగారెడ్డిలోని ఏటిగడ్డ కిష్టపూర్ వద్ద మంజీరా నదిలో ఏడుగురు నదిలో చిక్కుకుపోయారు. గత రాత్రి వ్యవసాయ క్షేత్రంలో వారు నిద్రించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగూరు గేట్ల ఎత్తివేతతో తెల్లవారు జాముకల్లా నీరు చుట్టుముట్టింది. యాదాద్రిలోని వలిగొండ మండలం సంజీమ్ వద్ద ధర్మారెడ్డి పల్లి కాలువకు గండిపడింది.


 


కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. గంగాధర, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట మండలాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హుజూరాబాద్ లో చిలుక వాగు పొంగడంతో ఒడ్డున ఉన్న నివాస ప్రాంతాలకు వరద వస్తోంది. కరీంనగర్ లో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతుండటంతో ఎల్ఎండీ జలాశయంలో నీటి మట్టం అమాంతం పెరిగిపోతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM