ఉదయం ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే?

byసూర్య | Tue, Mar 31, 2020, 01:36 PM

ఉదయం టీ కాఫీలకు బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే.. ఏంటి ఫలితం అని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కడుపులో ఉండే పేగుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తరిమికొట్టడంలో ఎంతో సహాపడుతుంది ఈ మజ్జిగ. ఈ మజ్జిగను తీసుకోవడం వల్ల చక్కర స్థాయిని నియంత్రించవవచ్చు. స్థూలకాయులు మజ్జిగలో కాస్త మిరియాలు, కరివేపాకు వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో మజ్జిగను మాత్రం మరిచిపోకూడదు. డీహైడ్రేషన్‌ను మజ్జిగ నియంత్రిస్తుంది. ఒంటి వేడికి మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి. అందువల్ల శరీరానికి బలం చేకూరుతుంది. మజ్జిగ ఆరోగ్యానికే కాదు చర్మానికి , శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కురులకు మజ్జిగను పట్టింది ఒక అరగంట ఉండి తల స్నానం చేస్తే ఎంతో మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. ఇక మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఉంచుకుని ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM