బడిలోకి దెయ్యాలొస్తున్నాయని క్షుద్రపూజలు

byసూర్య | Sat, Jan 11, 2020, 03:48 PM

టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో మూఢనమ్మకాల అలజడి ఎక్కడో ఓ మూల వినపడుతూనే ఉంది. నమ్మకాల మత్తులో పడి కొందరు బలి అవుతుంటే మరికొందరు చాలా ఇబ్బందులు పడుతున్న వైనం చాల చోట్ల ఇంకా చోటుచేసుకుంటూనే ఉంది. ఇటువంటి మూఢనమ్మకాలను ప్రారదోలేది ఒక్క చదువు మాత్రమే.


చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి. అయితే ఆ చదువు చెప్పే బడులే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ పాఠశాలలో మూఢ నమ్మకం తన పంజా విసిరింది. ఆ బడిలో ఓ ఉపాధ్యాయురాలు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తోంది. తమ బడికి దెయ్యాలు, భూతాలు వస్తున్నాయంటూ మూఢ నమ్మకంతో ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యునితో క్షుద్ర పూజలు చేయించింది. ఇప్పుడు ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రధానోపాధ్యాయురాలే ఈ విధంగా వ్యవహరించడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకుంటోంది. గురువులే ఇలా చేస్తుంటే ఇక విద్యార్థులు ఏ మార్గంలో వెళతారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఘటనను జీర్ణించుకోలేని చాలా మంది దీనిని విమర్శిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM