రెబల్స్ బుజ్జగింపుల్లో నేతలు బిజీ..

byసూర్య | Sat, Jan 11, 2020, 04:08 PM

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల వేసిన వారు అయా వార్డుల్లోని ఓటరు జాబితాలను పట్టుకొని తమకు అనుకూలం, వ్యతిరేకంగా ఉన్న ఓటర్లపై లెక్కలు వేసుకుంటున్నారు. తమ గెలుపు, ఓటములపై కూడా ఒక అంచనాకు వస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల్లో నామినేషన్లను వేసిన విషయం తెలిసిందే. కానీ అయా వార్డుల్లో అయా పార్టీల నుంచి ఒక్కరే నామినేషన్ వేసిన చోట పెద్దగా ఇబ్బందులేమి లేవు. వారంతా ఏకంగా తమ వార్డుల్లో ప్రచారం ప్రారంభించారు. కానీ ఒకే పార్టీ నుంచి రెబల్స్ గా నామినేషన్ వేసిన చోట అయా పార్టీల నాయకులకు తలనొప్పులుగా మారింది. అధికార పార్టీ టీఆర్ఎస్ లో రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఈ తలనొప్పి తగ్గడం లేదు. దీంతో అయా మున్సిపాలిటీలకు చెందిన నాయకులు రెబల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డట్లు తెలిసింది.


టీఆర్ఎస్ పార్టీలో రెబల్స్ గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించే బాధ్యత అయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండు రోజుల క్రితం మీటింగు పెట్టి వెల్లడించారు. రెబల్స్ గా నామినేషన్ వేసిన వారి వివరాలను కూడా అధిష్టానానికి పంపించాలని కూడా సూచించారు. రెబల్స్ కు నామినేటేడ్ పోస్టులుగానీ, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నచ్చజెప్పాలని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరాదని ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గులాబీ బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే పద్దతిలో నిన్నటి నుంచి కూడా రెబల్స్ తో ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఈ నెల 14వ తేదీ మద్యాహ్నం 3గంటలకు వరకూ నామినేషన్ విత్ డ్రాలకు సమయముండడంతో సంక్రాంతి పండుగ కంటే రెబల్స్ ను బుజ్జగించడమే పనిగా నాయకులు బిజీగా గడుపుతున్నారు.


టీఆర్ఎస్ పార్టీలో నిన్నటి నుంచి కూడా ముసలం ప్రారంభమైంది. ఫీర్జాదిగూడకు చెందిన దయాకర్ రెడ్డి మల్కజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, ఫీర్జాదిగూడ మేయర్ పదవి కోసం ఆశించిన దయాకర్ రెడ్డి పార్టీ అధిష్టానం వేరొకరిని ప్రతిపాదించడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దాని తర్వాత మంత్రి మల్లారెడ్డి దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఈ రోజు కూడా దయాకర్ రెడ్డి తమ వెంటే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు బలవంతంగా కండువా వేశారని మల్లారెడ్డి చెప్పడం గమనర్హం. ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా అధిష్ఠానం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడా జరుగుతున్నాయని చెప్పకతప్పదు.


కాంగ్రెస్ పార్టీలో కూడా రెబల్స్ బెడద తప్పలేదు. దీన్ని నివారించేందుకు శుక్రవారం ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ లైవ్ ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పాటించాల్సిన ఎత్తుగడలను కూడా వివరించారు. అంతేకాకుండా రెబల్స్ ను ఎక్కడికక్కడా బుజ్జగించాలని, భవిష్యత్ లో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రెబల్స్ గా వేసి అధికార పార్టీకి అవకాశం ఇవ్వవద్దని సూచించారు. అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులున్నాయని, వాటిని తమ పార్టీ కార్యకర్తలు చాకచక్యంగా వాడుకోవాలని ఆయన వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ లో అక్కడక్కడా రెబల్స్ ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం బుజ్జగించే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకత్వం చెబుతుంది.


రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పెద్దగా బలం లేనప్పటికీ నాల్గు పార్లమెంటు స్థానాలు గెలవడంతో ఆ పార్టీ ఆ స్థానాలపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లోని మున్సిపాలిటీలపై కూడా బీజేపీ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. కానీ పెద్దగా రెబల్స్ బెడద లేకపోయినప్పటికీ ఎక్కడైనా ఉంటే స్థానిక నాయకత్వమే చూసుకోవాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెబల్స్ కన్నా వార్డుల గెలుపుపైనే బీజేపీ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది.


టీడీపీ, జనసమితి, వామపక్షాలు తాము బలమున్న చోట మాత్రమే నామినేషన్లు వేసింది. వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. దీంతో వారికి అక్కడా రెబల్స్ బెడద ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ నిర్ణయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వారికి పెద్దగా ఇబ్బందులు తలెత్తవని తెలుస్తుంది. టీడీపీ గతంతో పోల్చితే చాలా బలహీనంగా ఉంది. బలమున్న చోటనే పోటీలో ఉండనున్నది. రెబల్స్ బెడద పెద్దగా లేదని చెప్పవచ్చు. ఇక తెలంగాణ జన సమితి తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉన్నా టిక్కెట్ల హడావుడి ఇప్పుడు లేదు. కానీ తమ ప్రభావం ఎక్కడా ఉందో అక్కడ పోటీ చేస్తుంది. దీంతో ఈ పార్టీకీ కూడా రెబల్స్ బెడద పెద్దగా లేదని చెప్పవచ్చు. రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో 21850 నామినేషన్లు దాఖలయ్యాయి.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM