సంక్రాంతికి దోచేస్తోన్న ప్రవేట్ ట్రావెల్స్

byసూర్య | Sat, Jan 11, 2020, 02:58 PM

సంక్రాంతి నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ సామాన్యులను టార్గెట్ చేశాయి. సోంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రజలకు టిక్కెట్ ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్లడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధిక ఛార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతోన్న బస్సుల యజమానులపై 25 కేసులు నమోదు చేశారు. ఇక విజయవాడలో కూడా దాదాపు 30 బస్సులపై కేసులు నమోదయ్యాయి.


మరోవైపు పండుగ నేపథ్యంలో నేడు నగరం నుంచి భారీగా ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫాస్ట్ ట్యాగ్ గేట్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


 


 


Latest News
 

పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి Thu, Mar 28, 2024, 04:26 PM
భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి: పీఓడబ్ల్యూ Thu, Mar 28, 2024, 04:25 PM
ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM