టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్​కు ఝలక్ ఇద్దాం: ఉత్తమ్​

byసూర్య | Fri, Jan 10, 2020, 06:47 PM

పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ కుట్రను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంతా సైనికుల్లా పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల సంఘం ద్వారా షెడ్యూలు విడుదల చేయించిందని ఆరోపించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌ నుంచి ఫేస్​బుక్​ లైవ్​ ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నేతలకు మున్సిపల్‌ ఎన్నికల్లో ఏవిధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు.


పార్టీ పరంగా తాము లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో... మున్సిపాలిటీలకు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలు... కార్పొరేషన్లలో ఏం ఉద్ధరించారని ఓటు అడుగబోతున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీఆర్ఎస్ ఎవరికైనా ఇచ్చారా అని నిలదీశారు.


ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని... రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదని ఉత్తమ్​ విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్‌కు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి ఝలక్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్లరద్దు, ముమ్మారు తలాక్, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ కు ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లేనని ఆరోపించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM