గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో పలు టీవీలపై భారీ తగ్గింపు

byసూర్య | Sun, Oct 13, 2019, 05:15 PM

అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా అన్ని వస్తువులపై ఇచ్చినట్లే టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఈ సేల్ కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలపై రూ.9 వేల నుంచి రూ.43 వేల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్ లో అమెజాన్ భారీ డిస్కౌంట్ అందించిన కొన్ని టీవీలు ఇవే..


1. రూ.40,990 విలువ చేసే హాయర్ 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ టీవీని ఈ సేల్ లో రూ.22,499కే విక్రయిస్తున్నారు. ఇది నలుపు రంగులో అందుబాటులో ఉంది.


2. రూ.45,990 విలువ చేసే కోడాక్ 50 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని ఈ డిస్కౌంట్ సేల్ లో రూ.22,999కే విక్రయిస్తున్నారు. ఇది కూడా నలుపు రంగులోనే అందుబాటులో ఉంది.




3. వీయూ 50 అంగుళాల 4K అల్ట్రా హెచ్ డీఆర్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర మార్కెట్లో రూ.42,000గా ఉండగా, దాన్ని రూ.29,100కే విక్రయిస్తున్నారు. ఆ టీవీ 2019 మోడల్ కావడం విశేషం. ఈ టీవీ కూడా నలుపు రంగులోనే అందుబాటులో ఉంది.


4. 55 అంగుళాల ఫోర్టెక్స్ 4K అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ మార్కెట్ ధర రూ.49,999గా ఉండగా, దాన్ని రూ.29,999కే విక్రయిస్తున్నారు. ఇది కూడా నలుపు రంగులోనే ఉంది.


5. 40 అంగుళాల Blaupunkt ఫ్యామిలీ సిరీస్ ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ టీవీ మార్కెట్ ధర రూ.23,000గా ఉండగా, దీనిపై రూ.9,001 తగ్గించి రూ.13,999గా విక్రయిస్తున్నారు. ఇది సిల్వర్ రంగులో అందుబాటులో ఉంది.


6. 55 అంగుళాల ఎయిసెన్ 4K అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఎమ్మార్పీ రూ.64,900గా ఉండగా, దీని ధరను రూ.42,990గా నిర్ణయించారు. ఇది కూడా సిల్వర్ రంగులో అందుబాటులో ఉంది.


7. 65 అంగుళాల షింకో 4K అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఎమ్మార్పీ రూ.79,990గా ఉండగా, ఈ సేల్ లో ఈ ఫోన్ ను రూ.47,999కే విక్రయిస్తున్నారు. ఇది 2019 మోడల్ కాగా, బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది.


8. 49 అంగుళాల టెలిఫన్ కెన్ ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఎమ్మార్పీ రూ.38,490గా ఉండగా, ఈ సేల్ లో దాని ధరను రూ.20,999గా విక్రయిస్తున్నారు. ఇది 2019 మోడల్ కాగా, బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది.


9. 55 అంగుళాల టీసీఎస్ ఏఐ 4K అల్ట్రా హెచ్ డీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర ఎమ్మార్పీ రూ.82,990గా ఉండగా, కేవలం రూ.39,999కే విక్రయిస్తున్నారు. ఇది 2019 మోడల్ కాగా, బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది.


10. 32 అంగుళాల ఫిలిప్స్ 4200 సిరీస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీ ధర మార్కెట్లో రూ.24,990గా ఉండగా, దాన్ని కేవలం రూ.12,999కే విక్రయిస్తున్నారు. ఇది కూడా నలుపు రంగులోనే అందుబాటులో ఉంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM