రెండు తెలంగాణ ప్రభుత్వాసుపత్రులకు జాతీయ గుర్తింపు

byసూర్య | Sat, Aug 24, 2019, 07:32 PM

తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ గుర్తింపు లభించింది. లక్ష్యా సర్టిఫికేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు ఈ సంవత్సరం మే 22వ తేదీ, మే 23వ తేదీల్లో సంగారెడ్డి, జహీరాబాద్ ఆస్పత్రుల్లోని లేబర్ రూం, ఆపరేషన్ రూంల తనిఖీలు నిర్వహించారు. లేబర్‌రూం, ఆపరేషన్ రూంల నిర్వహణలో జహీరాబాద్ ఆస్పత్రి 97శాతం, 87 శాతం స్కోర్‌ను సాధించగా, సంగారెడ్డి ఆస్పత్రి 93శాతం, 91శాతం స్కోరు సాధించింది. దానికి సంబంధించిన గుర్తింపు పత్రాలను ఈ రోజు అందజేస్తున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, అడిషనల్ సెక్రటరీ మనోజ్ జలాని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు పంపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM