మూడు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు

byసూర్య | Sun, Aug 18, 2019, 12:48 PM

తెలంగాణలో మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రోగుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. 242 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కాగా ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లుల కోసం కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్‌ ఆసుపత్రులు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. అయినా బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM