బాస‌ర ల‌డ్డూలో బొద్దంక - లైట్ తీస్కోమ‌న్న అధికారులు

byసూర్య | Sun, Jun 23, 2019, 03:02 PM

చ‌దువుల స‌ర‌స్వ‌తి నెల‌వైన బాస‌ర‌లో రోజు వేల సంఖ్యలో తల్లిదండ్రులు అమ్మవారి సన్నిధిలో త‌మ‌ పిల్లలకు  అనేక విద్య‌లు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కంతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదాలు స్వీకరించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ప్ర‌సాదం విష‌యంలో బాస‌ర ఆల‌య క‌మిటి ప‌ర్యవేక్ష‌ణాలోపం అనేక సార్లు వివాదాల‌కు తావిచ్చింది. తాజాగా  బాసర లడ్డూ ప్రసాదంలో పురుగులు బయటపడటంతో మ‌రోమారు వార్త‌ల‌లోకి ఎక్కింది.  ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే  శనివారం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సమేతంగా బాసరలోని స‌ర‌స్వ‌తీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్ర‌సాదం కౌంట‌ర్‌లో లడ్డు ప్రసాదాన్ని కొన్నారు. తీరా లడ్డు  విర‌చి చూడగా బొద్దింక  క‌న‌పడటంతో షాక్‌కు గురయ్యారు. ఈ విస‌యం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లైట్ తీస్కో... అన్న‌ట్టు మాట్లాడార‌ని భ‌క్తులు ఆరోపిస్తుంటే....  ఆలయ అధికారులు లడ్డూ తయారీలో నాణ్యతను పాటిస్తున్నామ‌ని, బొద్దింక ల‌డ్డులో క‌లిసింద‌న‌టం స‌రికాద‌ని బుకాయిస్తున్నారు.   గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా, చ‌ర్య‌లు లేవ‌ని. ఇప్పటికైనా సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM