15 శాతమే.. పూర్తయిన కాళేశ్వరంను ఎలా ప్రారంభిస్తారు : ఎమ్మెల్యే భట్టి

byసూర్య | Thu, Jun 20, 2019, 04:12 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత విమర్శలను ఎక్కుపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన చర్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణంలో... నిజాలను పక్కన బెట్టి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకోసం విశ్రాంత ఇంజనీర్లను ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాగా 15 శాతం పూర్తయిన ప్రాజెక్టుకే 50వేల కోట్ల రుపాయాలు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారాని ప్రశ్నించారు. మరోవైపు ప్రాజెక్టు యొక్క డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలని కోరుతున్న ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు నేరుగా చెప్పని ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్లతో అబద్దాలు ప్రచారం చేస్తుందని అన్నారు.


15 శాతం కూడ పూర్తికాని ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించి భవిష్యత్‌లో రాష్ట్ర్ర ప్రజలు భారంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రాజెక్టులో నిజానిజాలు బయటకు వస్తాయనే ప్రతిపక్ష పార్టీలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరందిస్తామని చెబుతున్న సీఎం, ప్రారంభోత్సం తర్వాత కనీసం లక్ష ఎకరాలకైనా నీరందిస్తారా అని ప్రశ్నించారు.మరోవైపు ఉమ్మడి రాష్ట్ర్రంలో 70 శాతం పూర్తయిన సాగునీటీ ప్రాజెక్టులను పక్కన భట్టి రీ డిజైన్ పేరుతో ప్రజలపై సీఎం కేసీఆర్ భారం వేస్తున్నారని విమర్శించారు.


 


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM