వ్యాఖ్యలపై 10 రోజుల్లో వివరణ కోరుతూ కోమటిరెడ్డి కి షోకాజ్ నోటీసులు!

byసూర్య | Wed, Jun 19, 2019, 08:50 PM

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త కుంతియాపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ  కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఇటీవలే సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఇప్పట్లో కోలుకోలేదంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. నరేంద్రమోదీని ప్రధానిగా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు సైతం బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని మరీ ఇంత దౌర్భాగ్య పరిస్థితికి చేరేది కాదన్నారు.   


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM