ఉప్పల్ లో ఏర్పాట‌యిన మినీ శిల్పారామం !

byసూర్య | Wed, Jun 19, 2019, 08:25 PM

భాగ్యనగర ప్రజలకు పల్లె అందాలను, అనుభూతిని పంచేందుకు మరో శిల్పారామం సిద్ధమయింది. హస్తకళలు, చేనేత వస్త్రాలకు నిలయంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ఈ నెల 22న ప్రారంభం కానున్నది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ, శిల్పారామం విభాగాల అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు. హెచ్‌ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్‌లోని ఏడున్నర ఎకరాల స్థలంలో రూ. ఐదు కోట్లతో మినీ శిల్పారామాన్ని నిర్మించారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలు సేదతీరడానికి పచ్చని మైదానం, చూపరులను ఆకట్టుకొనే రీతిలో శిల్పారామం ఆర్చీ (ప్రవేశ ద్వారాన్ని) ఏర్పాటుచేశారు. అంతేకాదు వెదురు బొంగులతో నిర్మించిన స్టాళ్లు ఆకట్టుకొంటున్నాయి.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM