జగన్ వస్తే తప్పేంటి?: జగ్గారెడ్డి

byసూర్య | Wed, Jun 19, 2019, 03:14 PM

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ నెల 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి జగన్ వస్తే దివంగత వైయస్సార్ ఆత్మ క్షోభిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ... ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగదని హితవు పలికారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే... తన నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని... కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఆయనకు దక్కిందని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే ఆ విషయాన్ని భట్టి విక్రమార్క చూసుకుంటారని చెప్పారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM