అరుణ్ జైట్లీకి అరుదైన కేన్సర్

byసూర్య | Thu, Jan 17, 2019, 09:04 AM

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మృదుకణజాల కేన్సర్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన తొడ భాగంలో కణితి ఏర్పడింది. గతేడాది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న జైట్లీకి కేన్సర్ రూపంలో మరో ముప్పు తలెత్తింది. దీంతో రెండు వారాల పాటు వ్యక్తిగత సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన చికిత్స నిమిత్తం న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. 


జైట్లీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు కీమోథెరపీ ఇస్తూ ట్రీట్‌మెంట్ చేస్తే ఆ భారాన్ని ఆయన కిడ్నీలు తట్టుకోలేవని, దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మన దేశ ప్రముఖ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జైట్లీకి అమెరికా వైద్యులు ట్రీట్‌మెంట్ చేయకుండా కొన్ని మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అలాగని ఆయనకు చికిత్స చేయకపోయినా ప్రాణాలకు ముప్పేనని, ఆయనకు వచ్చిన కేన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా పాకే లక్షణం కలదని వైద్యులు చెబుతున్నారు. 


అరుణ్ జైట్లీకి కేన్సర్ సోకినట్లు తెలియగానే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ త్వరలో కోలుకోవాలని, ఆయన అభిప్రాయాలు, భావాలతో రాజకీయంగా విభేదిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే షాక్‌కు గురయ్యానని రాహుల్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM