ఇవాళ నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

byసూర్య | Thu, Jan 17, 2019, 08:10 AM

తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన 36 రోజుల తర్వాత ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు నాలుగు రోజులపాటు జరుగుతాయి. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ముందుగా సీఎం కేసీఆర్‌ ప్రమాణం చేస్తారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం జరుగుతుంది. దాదాపు రెండు గంటలపాటు సభ్యుల ప్రమాణస్వీకారాలు ఉంటాయి. 18న స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. శాసనసభ, మండలి బీఏసీల సమావేశాలు కూడా జరుగుతాయి. 19న ఉభయసభల సమావేశంలో గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. ఇక..స్పీకర్‌ ఎంపిక కోసం ఇవాళ ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM