త్వరగా పెళ్లి చేసుకోమని అడుగుతా ! ప్రభాస్

by సూర్య | Thu, Aug 22, 2019, 09:53 AM

భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో ఈ నెల 30న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి విడుదల అవుతోంది. 
దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఛానల్‌కు ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపోర్టర్ అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి అడగ్గా..‘నాకూ లేదా అనుష్కకు..ఎవరికో ఒకరికి పెళ్లి అయితే తప్ప ఈ రూమర్స్ ఆగవు’ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు అనుష్కను ఈసారి కలిసినప్పుడు ‘త్వరగా పెళ్లి చేసుకోమని అడుగుతానంటూ’ సరదాగా అన్నాడు. ఒకవేళ మేం ప్రేమలో ఉంటే ఎక్కడో చోట తిరిగేవాళ్ళమే కదా? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడతాం అని ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్, అనుష్కలు పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వదంతులు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడటానికి ఇల్లు కూడా వెతుకుతున్నారని రూమర్స్ వచ్చాయి.





 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM