ఈసారైనా హిట్ కొట్టి నిలబడుతుందా?

by సూర్య | Tue, Aug 13, 2019, 06:32 PM

తెలుగులో కాస్త ట్రెడిషనల్ పాత్రల్లో నటించినా అమ్మడుకి క్రేజ్ మాత్రం రాలేదు. అన్ని యావరేజ్ హిట్స్ నే సొంతం చేసుకున్న రెజీనా కాసాండ్రా అందాల ఆరబోతకు సిద్దమే అంటూ… జీరో సైజు ట్రై చేసిన రెజినా కి అస్సలు ఆఫర్స్ మాత్రం రాలేదు. యంగ్ హీరోలు కూడా రెజినా ని పట్టించుకోవడం మానేశారు. అయితే రెజినా కోలీవుడ్ లో గ్లామర్ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది…. కానీ అమ్మడుకి ఓ అన్నంత అవకాశాలు మాత్రం రాలేదు. హాట్ హాట్ గ్లామర్ పాత్రలకు సై అని ఎన్నిసార్లు సోషల్ మిడియా ద్వారా చెప్పాలని చూసినా రెజీనాని పట్టించుకున్న నాధుడే లేదు.


తాజాగా ఎవరు సినిమాలో అడవి శేష్ సరసన నటించిన రేజీనాకి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు సినిమా మీద మంచి ఆసక్తి అంచనాలే ఉన్నాయి. అడవి శేష్ గత సినిమాలు క్షణం, గూఢచారి సినిమాలు హిట్ అవడం, అలాగే క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను అంచనాలున్నాయి. రెజినా కాసాండ్రా రేప్ కి గురైన అమ్మాయిగా, తనని బలాత్కరించిన వ్యక్తిని మర్డర్ చేసిన అమ్మాయిగా గ్లామర్ గా కనిపిస్తుంది. రేపు గురువారం ఆగష్టు 15 న విడులా కాబోతున్న ఎవరు సినిమా గనక హిట్ అయితే మళ్ళీ రెజినా కెరీర్ టాలీవుడ్ లో ఊపందుకునే అవకాశం ఉంది. మరి రేపు ఒక్కరోజులో రెజినా జాతకం టాలీవుడ్ లో ఎలా ఉండబోతుందో అనేది తేలిపోతుంది.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM