కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ

by సూర్య | Mon, Jun 24, 2019, 10:06 AM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికలు ఈ మధ్యనే జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల తర్వాత తొలి సర్వసభ్య సమావేశం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నటి హేమ ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు కష్టాలు పడుతున్నారని, అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన అవసరం దర్శకనిర్మాతలపై ఉందని ఆమె పేర్కొన్నారు. ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు తిండి పెట్టాలని, ఎక్కడో బయటి నుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకువచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దని ఆమె కోరారు.


ఇవాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాలు లేక ఆర్ధికంగా చాలా కష్టాలు పడుతున్నారని వాళ్ల ఆకలి బాధను గుర్తించి వేషాలు ఇవ్వాలని కోరారు. ఇక మా అసోసియేషన్ లో 800 మంది సభ్యులుంటే వాళ్లలో ఓ 150 మంది మహిళలు ఉంటారని కనీసం వాళ్లకు అన్నం పెట్టి, బట్టలు కూడా ఇవ్వలేమా ? మీ కాళ్లకు దండం పెడతాను సార్, దయచేసి మన తెలుగు మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండని అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు. చూడాలి మరి మన దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో ?

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM