నాకు 'సారీ' చెప్పిన గొప్ప మనసు ఎన్టీఆర్ గారి సొంతం: కైకాల

by సూర్య | Sun, Jun 23, 2019, 11:31 AM

సాంఘిక .. చారిత్రక .. పౌరాణిక .. జానపద చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ," నా కెరియర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ గారు నన్నెంతగానో ఆదరించారు. నాపై నమ్మకంతో బలమైన పాత్రలను ఇచ్చారు. ఫలానా పాత్ర కైకాల బాగా చేస్తారు అని నాకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు .. ఒక తమ్ముడిగా చూసుకునేవారు.


అలాంటి మా ఇద్దరి మధ్య కూడా మనస్పర్థలు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నించారు. నా గురించి వాళ్లు చెప్పిన మాటలు నిజమనుకుని ఎన్టీఆర్ గారు మనసు కష్టపెట్టుకున్నారు. ఆ విషయం తెలిసి నేను ఆయనను కలిసి, నా గురించి ఆయన విన్నదాంట్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాను. నా గురించి కల్పించి చెప్పిన వ్యక్తులను పిలిపించి, వాళ్లు మాట మార్చడంతో అసలు విషయం తెలుసుకున్నారు. ఆ సందర్భంలో నాకు 'సారీ' చెప్పిన గొప్ప మనసు ఎన్టీఆర్ గారి సొంతం" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM