తమ్ముడు జీతం తోనే మా కుటంబం నడిచింది: ఎల్బీ శ్రీరామ్

by సూర్య | Sun, Jun 23, 2019, 11:38 AM

రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా ఎల్బీ శ్రీరామ్ కి ఎంతో అనుభవం వుంది. అలాంటి ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తమ్ముడిని గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. నాటకాలు రాసేవాడిని .. నటించేవాడిని .. దర్శకత్వం వహించేవాడిని. అందువలన చేసే ఉద్యోగంపై దృష్టిపెట్టలేక మానేస్తుండేవాడిని.


ఇలా ఎన్ని ఉద్యోగాలని మానేస్తాం అనిపించింది. అప్పటికే పెళ్లైపోవడం వలన భార్యను ఎలా పోషించడం అనే ఆందోళన మొదలైంది. సినిమాల్లో ట్రై చేయమని మా తమ్ముడు అన్నాడు. ఒక ఏడాదిపాటు గట్టి ప్రయత్నం చేయమనీ, అప్పటివరకూ తాను డబ్బు సర్దుతానని అన్నాడు. వాడికొచ్చే కొంత జీతంలోనే నా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. నా తమ్ముడు నాకు అండగా నిలవడం వల్లనే నేను ఈ రోజున ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM