‘క ‘ చిత్రం బిజినెస్ అదిరింది !

by సూర్య | Wed, Oct 30, 2024, 03:14 PM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు మేకర్స్. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరక్కేక్కిన ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగ ప్రి రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా బజ్ అమాంతం పెరిగింది.నేడు ప్రీమియర్స్ తో రిలీజ్ కానున్న ‘క’ ప్రీ రిలీజ్ బిజినెస్ కిరణ్ సబ్బవరం కెరీర్ లోనే హయ్యెస్ట్ రేట్ కు సేల్ అయింది. ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి రూ. 12 కోట్లకు కొనుగోలు చేసారు. సదరు డిస్ట్రిబ్యూటర్ నైజాం : రూ. 3.6 కోట్లకు, రాయలసీమ : రూ. 1.4 కోట్లు, ఆంధ్ర రూ. 3 కోట్లు రేషియోలో బిజినెస్ చేసారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ రూ. 2 కోట్లు గా డీల్ క్లోజ్ చేసారు. మొత్తం గా వరల్డ్ వైడ్ గా రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగుతున్నాడు కిరణ్ అబ్బవరం. హిట్ టాక్ వస్తే ఈ మొత్తం రికవరీ కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాల అంచనా. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ‘క’ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నీ గంటల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.

Latest News
 
ప్రియుడు మహ్మద్ వాజిద్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న సనా సుల్తాన్ Tue, Nov 12, 2024, 04:16 PM
రాణి ముఖర్జీని ఈ పేరుతో పిలిచేవారు... Tue, Nov 12, 2024, 04:10 PM
‘సికందర్ కా ముఖద్దర్’ ట్రైలర్ విడుదల Tue, Nov 12, 2024, 03:55 PM
తెలుగు బ్యూటీ బర్త్ డే.. ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ Tue, Nov 12, 2024, 03:17 PM
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.... Tue, Nov 12, 2024, 02:17 PM