by సూర్య | Wed, Oct 30, 2024, 09:03 PM
నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు విశేషాలను ఓటీటీ సంస్థ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపింది. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుందని, ఆమె చిన్నప్పటినుంచి పెళ్లివరకూ సాగే ప్రయాణాన్ని చూపించనున్నట్లు పేర్కొంది.ఇక నయనతార కెరీర్ విషయానికొస్తే.. కాలేజీ రోజుల్లో పార్ట్‌టైమ్ మోడల్‌గా పనిచేసిన నయనతారను చూసిన.. దర్శకుడు సత్యన్ అంతికాడ్ ‘మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో ఇండస్ట్రీలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. తెలుగులోనూ దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ‘నేను రౌడినే’ సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఏర్పడ్డ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. అనంతరం కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2022లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Latest News