by సూర్య | Wed, Oct 30, 2024, 09:01 PM
మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఈ సినిమాకి ‘మాస్ జాతర’ అనే పేరు ఖరారు చేశారు. ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్ యాడ్ చేశారు. ఇక వేసవి కానుకగా మే 9న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Latest News