సినీ స్టూడియో కోసం ఎన్ శంక‌ర్ కు ఐదెక‌రాల కేటాయింపు

by సూర్య | Wed, Jun 19, 2019, 01:59 PM

  తెలంగాణలో తొలి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ప్రముఖ దర్శక నిర్మాత ఎన్ శంకర్‌కు స్థ‌లం కేటాయించాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సోమ‌వారం స‌మావేశ‌మైన తెలంగాణ మంత్రి వ‌ర్గం హైదరాబాద్ శివారులోని మోకిల గ్రామంలో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ   నిర్ణయం తీసుకుంది. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ ప్రాంతం చెందిన వ్యక్తులకు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటివరకు  స్టూడియోలు మాత్రమే ఉన్న నేప‌థ్యంలో తొలిసారి తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తి సినీ స్టూడియో ఏర్పాటుకు సిద్ద‌మ‌వుతున్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. తెలంగాణాలో స్టూడియోను ఏర్పాటు చేస్తామని ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌ కేసీఆర్  తొలి సారి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ప్పుడు  ఎలాంటి చర్యలు తీసుకోలేకున్నా, రెండో ప‌ర్యాయం అధికారంలోకి రాగానే స్టూడియో నిర్మాణానికి స్థ‌ల కేటాయింపు చేసారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో దర్శకుడు ఎన్ శంకర్ జైబోలో తెలంగాణ అనే ఉద్యమ నేపధ్య చిత్రాన్ని రూపొందించ‌డంతో తెలంగాణా ఉద్యమం వాడ వాడ‌లా విస్త‌రించి మరింత బలపడిన విష‌యం విదిత‌మే.


 


 

Latest News
 
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM