ఫుడ్డు దొరుకుతుందని 'పెళ్లి చూపులు' చేశాను: ప్రియదర్శి

by సూర్య | Wed, Jun 19, 2019, 01:10 PM

తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో ప్రియదర్శి ఒకరు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆయన, వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "నాకు విలనిజం అంటే ఇష్టం .. అందువలన విలన్ పాత్రల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఒక కోట శ్రీనివాసరావు .. ఒక ప్రకాశ్ రాజ్ స్థాయికి వెళ్లాలని అనుకునేవాడిని.


ఈ కారణంగానే 'టెర్రర్' .. 'బొమ్మల రామారం' సినిమాల్లో విలన్ గా నటించాను. ఆ సినిమాలు అంతగా గుర్తింపు తీసుకురాలేదు .. ఆ తరువాత అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా 'పెళ్లి చూపులు' సినిమాలో అవకాశం వచ్చింది. ఏదో ఒకటిలే .. ముందు ఫుడ్డు దొరుకుతుందని చేశాను. ఆ పాత్రే నా కెరియర్ ను మలుపు తిప్పింది. నన్ను కమెడియన్ ను చేసి ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది" అని చెప్పుకొచ్చాడు. 

Latest News
 
ఆహాలో డిజిటల్ అరంగేట్రంకి సిద్ధంగా ఉన్న 'లవ్‌గురు' Fri, Apr 19, 2024, 02:53 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:51 PM
ఆఫీసియల్ : 'టిల్లు స్క్వేర్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Apr 19, 2024, 02:38 PM
'ప్రతినిధి 2' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 02:36 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మై డియర్ దొంగ' Fri, Apr 19, 2024, 02:35 PM