లండ‌న్ మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ప్రియాంక మైన‌పు విగ్ర‌హం

by సూర్య | Wed, Jun 19, 2019, 11:27 AM

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్ళిన ప్రియాంక చోప్రా ఫ్యాన్ ఫాలోయింగ్ ఖండాంతరాలు దాటింది. దేశ వ్యాప్తంగానే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమెని అభిమానించే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. ఆమె క్రేజ్ దృష్ట్యా మేడ‌మ్ టుస్సాడ్స్ ప్రియాంక చోప్రా మైన‌పు విగ్ర‌హాల‌ని న్యూయార్క్‌, సిడ్నీ, సింగ‌పూర్, బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌ల‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం ప్రఖ్యాత లండన్ “మేడం టుస్సాడ్స్” మ్యూజియంలో పెట్టనున్నారు. ఈ మేరకు మేడం టుస్సాడ్స్ బృందం త‌మ ట్విట్ట‌ర్‌లో వెల్‌క‌మ్ టూ లండ‌న్ అనే పోస్ట్ పెట్టింది.


నిక్ జోనాస్‌తో వివాహం త‌ర్వాత న్యూయార్క్‌లోనే ఎక్కువ‌గా ఉంటుంది ప్రియాంక‌. మేడ‌మ్ టుస్సాడ్స్ వారు కూడా న్యూ యార్క్ వెళ్లి ఆమె కొల‌త‌లు తీసుకున్నారు. 2018 నుండి ఈ వాక్స్ విగ్రహంకి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. మంగ‌ళ‌వారం లండ‌న్‌లో ప్రియాంక మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించగా, ఆ విగ్ర‌హం 2017లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో బంగారు వన్నెతో ఉండే లాంగ్ గౌన్ డ్రెస్ ధ‌రించిన ప్రియాంక మాదిరిగా ఉంది. ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వాక్స్ స్టాచ్యూకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. టుస్సాడ్స్ బృదంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది, నాకు వారిచ్చిన ఈ గౌరవానికి ధన్యవాదాలు అని తెలిపారు. ఇటీవ‌ల షాహిద్ క‌పూర్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం విదిత‌మే.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM