'మెకానిక్ రాకీ' ట్రైలర్ లాంచ్ కి టైమ్ లాక్

by సూర్య | Sat, Oct 19, 2024, 02:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అక్టోబర్ 20న మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని మధ్యాహ్నం 4:06 గంటలకి లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 22, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News
 
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM